ఈ రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • సెన్సెక్స్ కి 156 పాయింట్లు, నిఫ్టీకి 57 పాయింట్ల నష్టం
  • లాభపడ్డ యస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ సంస్థల షేర్లు
  • నష్టాలు చవిచూసిన విప్రో, గెయిల్, ఇండియా బుల్స్
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలతో పాటు అమ్మకాల ఒత్తిడితో ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 156 పాయింట్లు నష్టపోయి 35,853 పాయింట్ల వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల నష్టంతో 10,738 పాయింట్ల వద్ద ముగిశాయి. 

ఇక ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, మారుతి సంస్థల షేర్లు లాభపడ్డాయి. విప్రో, గెయిల్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ సంస్థల షేర్లు నష్టపోయాయి.  
Go Back to Shorts
NSE
NIFTy
BSE
Yes bank
infosis
bajaj fin

More Telugu News